అఖిల్ “ఏజెంట్” పై రేపు మాసివ్ అప్డేట్!

Published on Feb 2, 2023 8:40 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా ల పై సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం ను ఈ సమ్మర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2:14 గంటలకు మాసివ్ అప్డేట్ అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ రాగా, అఖిల్ అక్కినేని ఈ చిత్రం కోసం తన శరీరాకృతి ను పూర్తిగా మార్చేశారు.

సంబంధిత సమాచారం :