అఖిల్ “ఏజెంట్” డిజిటల్ ప్రీమియర్ అప్పుడే?

Published on Jun 5, 2023 11:00 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఏప్రిల్ 2023 లో థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే 19, 2023న ప్రీమియర్‌గా ప్రదర్శించాలని మొదట ప్లాన్ చేయడం జరిగింది.

కానీ తెలియని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకుంది. ఓటిటి లో మంచి ఎక్స్ పీరియన్స్ కోసం, కొన్ని సన్నివేశాలను తొలగించి, ఎడిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాస్త ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం, రీ ఎడిటింగ్ వర్క్ ఇంకా కొనసాగుతోంది. ఈ చిత్రం చివరకు జూన్ 23, 2023న OTT లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే, స్ట్రీమింగ్ సర్వీస్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్‌గా నటించారు. ఊర్వశి రౌతేలా ఓ ప్రత్యేక పాటలో అలరించింది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :