గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన అఖిల్ హీరోయిన్ !


అక్కినేని అఖిల్ డెబియో మూవీ ‘అఖిల్’ తో వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ సాయేషా సైగల్ ఆ సినిమా తర్వాత తెలుగు పరిశ్రమ నుండి కోలీవుడ్ కు వెళ్లి అక్కడ జయం రవి చిత్రం ‘వనమాగన్’ తో ఎంట్రీ ఇచ్చి తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ మధ్యే ప్రభుదేవా డైరెక్షన్లో విశాల్, కార్తీ నటిస్తున్న ఒక చిత్రానికి సైన్ చేసిన ఆమె తాజాగా మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది.

ప్రస్తుత తమిళ స్టార్ హీరోల్లో మంచి ఫామ్ లో ఉన్న నటుడు విజయ్ సేతుపతి. ఇటీవలే ‘విక్రమ్ వేద’ తో మంచి విజయాన్ని అందుకున్న సేతుపతి త్వరలో చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ లో సైతం నటించనున్నాడు. అలాగే దర్శకుడు గోకుల్ డైరెక్షన్లో ‘జుంగా’ అనే సినిమాని కూడా స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలోనే సాయేషా ప్రధాన హీరోయిన్ గా కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ఆమె ఎదుగులకు బాగా దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం పారిస్ లో చిత్రీకరించనుండటం విశేషం.