ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న అఖిల్ ‘జున్ను’ !
Published on Mar 19, 2017 11:09 am IST


అక్కినేని అఖిల్ రెండవ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. చాన్నాళ్ల పాటు సరైన దర్శకుడి కోసం ఎదురుచూసిన అఖిల్ ఎట్టకేలకు ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మొదటి స్క్రిప్ట్ అంతగా నచ్చకపోవడంతో నాగార్జున మరొక స్క్రిప్ట్ చేయమని కోరగా విక్రమ్ కుమార్ రెండవ స్క్రిప్ట్ కూడా వినిపించాడు. అది నచ్చడంతో దాన్ని ఫైనల్ చేశారు నాగార్జున.

ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు ‘జున్ను’ అనే టైటిల్ ప్రస్తావనలో ఉంది. రొమాంటిక్, యాక్షన్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ కథకు ఈ టైటిల్ అయితేనే సరిగ్గా సరిపోతుందని, దీన్నే ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదటి సినిమా ‘అఖిల్’ పరాజయం తర్వాత నాగార్జున పూర్తి శ్రద్ధతో జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 
Like us on Facebook