క్రికెట్ టోర్నమెంట్ లో విజయం సాధించిన అఖిల్ టీం

akhil
‘మేము సైతం’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలో భాగంగా జరిగిన సూపర్ సిక్స్ క్రికెట్ మ్యాచ్ లలో కింగ్ నాగార్జున/ అఖిల్ టీం విజయం సాధించింది. సమయం ఎక్కువగా లేకపోవడం వలన కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ టీంల మధ్య జరుగుతున్న సూపర్ సిక్స్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ను 2 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన నాగార్జున టీం 2 ఓవర్లలో 26 పరుగులు చేశారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వెంకటేష్ టీం లక్ష్యాన్ని చేదించలేకపోయింది. 4 పరుగుల తేడాతో విజయం కింగ్ నాగార్జున టీంను వరించింది. ఫ్రెండ్లీగా జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్ లు బోలెడు వినోదాన్ని అందించాయి.

క్రికెట్ మ్యాచ్ లు పూర్తవడంతో తిరిగి వినోద కార్యక్రమాలు మొదలుకానున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి, ‘బాహుబలి’ టీం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది.

ఈ రోజు ఉదయం నుండి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నిర్విరామంగా ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు.

‘మేము సైతం’ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Exit mobile version