ఓజి: పవన్ ను అలా చూసేందుకు ఎదురు చూస్తున్న అకీరా!

ఓజి: పవన్ ను అలా చూసేందుకు ఎదురు చూస్తున్న అకీరా!

Published on Jul 1, 2024 5:00 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ఇటీవల ఓజి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ ఓజి చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై అంచనాలను పెంచేసింది. అయితే ఈ చిత్రం కోసం అభిమానుల లాగానే, అకీరా కూడా ఎంతో ఆతృత గా ఎదురు చూస్తున్న విషయాన్ని అడివి శేష్ వెల్లడించారు.

అయితే సాహో చిత్రం తరువాత డైరెక్టర్ సుజీత్ ఎలాంటి చిత్రం ను కమిట్ కాకుండా, కేవలం ఓజి కోసం మాత్రమే తన పూర్తి సమయాన్ని కేటాయించారు. బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి అని, పవన్ ఓజి చిత్రం కోసం వాటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు