ఏజెంట్ మూవీ నుంచి అఖిల్ లేటెస్ట్ లుక్ వైరల్..!

Published on May 29, 2022 2:59 am IST


అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ “ఏజెంట్”. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్‌తో కొత్తగా మేకోవర్ అవ్వడమే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి అఖిల్ ఫోటోస్ కొన్ని బయటికివచ్చాయి. ప్రస్తుతం ఏజెంట్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుండగా ఆ యాక్షన్ సీక్వెన్స్ మూడ్‌లో ఉన్న అఖిల్ ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్‌ని ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని రామబ్రహ్మ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :