సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న అఖిల్ !

యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ చిత్ర షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. వచ్చే వారంలో ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ కానుంది. ఇక ఈ చిత్రంలోని ఇంట్రడక్షన్ సాంగ్ లో అఖిల్ కొద్దీ సేపుచొక్కా లేకుండా సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నారట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈసాంగ్ సినిమాకు హైలైట్ కానుందని సమాచారం.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. ‘తొలిప్రేమ’ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి చివర్లో విడుదలకానుంది.

Exit mobile version