ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ ప్రదానోత్సం కన్నుల పండువగా జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులు అందించే ఈ ప్రెస్టీజియస్ అవార్డును 2024 సంవత్సరానికి గాను మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ అవార్డ్ ప్రదానోత్సవం కార్యక్రమం తాజాగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు.
ఇక ఈ అవార్డును బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వర రావుని వారు గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ సందడి చేశారు. ఇక చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందజేసిన అమితాబ్ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్లతో కలిసి అక్కినేని నాగార్జున సహా అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఈ ఫోటోలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.