అక్కినేని హీరోలు ఆ ప్లాన్ పక్కనబెట్టారా..?

స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన కుమారులు నాగచైతన్య, అఖిల్ కలయికలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రద్దయినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కృష్ణ సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్ పట్ల చైతన్య, అఖిల్ అసంతృప్తిగా ఉండటంతో ఈ సినిమాను పక్కన పెట్టాలని నిర్ణయించారట. ఈ ప్రాజెక్ట్‌పై ముందే ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, దీని రద్దు గురించి కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు.

ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో అక్కినేని హీరోలు తమ నెక్స్ట్ చిత్రాలపై దృష్టి పెట్టారు. నాగచైతన్య ‘ధూత 2’, దర్శకుడు క్లాక్స్ సినిమా, మరియు ఒక హారర్ ప్రాజెక్ట్‌తో బిజీ కానుండగా.. అఖిల్ ఈ నెలలోనే తన కొత్త సినిమాను ఫైనల్ చేయనున్నాడు. ఇక నాగార్జున తన ప్రతిష్టాత్మక ‘కింగ్ 100’ రిలీజ్‌కు రెడీ చేసి, దసరా తర్వాత మరో కొత్త సినిమాను ఓకే చేయబోతున్నాడట.

Exit mobile version