గుబురు గడ్డం తో అక్కినేని నాగ చైతన్య మాస్ లుక్…అద్దిరిపోయిందిగా!

Published on May 23, 2022 7:03 pm IST

అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. లవ్ స్టోరీ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ యంగ్ హీరో, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రం లో నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అక్కినేని నాగ చైతన్య గుబురు గడ్డం తో మాస్ లుక్ లో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సిగరెట్ తాగుతూ ఉన్న ఈ హీరో లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లో రాశి ఖన్నా, అవికా గోర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :