మై హీరో, మై ఇన్స్పిరేషన్…నాన్న గారు – అక్కినేని నాగార్జున

Published on Sep 20, 2021 1:50 pm IST


సెప్టెంబర్ 20 వ తారీకు నాకు చాలా ముఖ్యమైన రోజు, మై హీరో, మై ఇన్స్పిరేషన్ నాన్న గారి పుట్టిన రోజు అంటూ అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు. తాజాగా ఒక వీడియో ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు, అభిమానులతో షేర్ చేసుకున్నారు. నాన్నగారికి పంచ కట్టు అంటే చాలా ఇష్టం అని, ఆయన పంచ కట్టుకున్నప్పడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేసేది, ఆయనకు పొందూరు ఖద్దరు అంటే చాలా ఇష్టమని, ఇది పొందూరు ఖద్దరు అంటూ నాగార్జున తను ధరించిన పంచకట్టు ను చూపించారు. ఆయన నవరత్నాల హరం, ఆయన నవరత్నాల ఉంగరం, ఈ వాచ్ నాకన్నా సీనియర్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఫేవరేట్ వాచ్ ఇప్పుడు తన ఫేవరేట్ వాచ్ అంటూ నాగార్జున తెలిపారు. ఇవన్నీ వేసుకుంటే ఆయన తనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నారు. ఆయన పంచకట్టు ను మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ఇది మా ప్రయత్నం అంటూ బంగార్రాజు చిత్రం కి సంబంధించిన లుక్ లో కనిపించారు. ANR lives on అంటూ చెప్పుకొచ్చారు.

అక్కినేని నాగార్జున బంగార్రాజు చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అక్కినేని నాగ చైతన్య సైతం నటిస్తున్నారు. ఇది వరకే వీరు మనం మూవీ లో కలిసి నటించగా, మరొకసారి మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్దం అయ్యారు. ఏఎన్నార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో ను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, లైక్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :