వరద బాధితులకు అండగా నిలబడదాం – నాగ్, అమల

కేరళలో ప్రస్తుతం వ‌ర‌ద‌ల‌ కారణంగా తీవ్ర ఇబ్బందులతో అక్కడి ప్రజలు అల్లాడిపోతుతున్న విషయం తెలిసిందే. వారి బాధకి అన్ని సినీరంగాల ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, సూర్య సోదరులు, ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్, అలాగే యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తదితరులు వరద బాధితుల‌కు విరాళాలు అందించి అండగా నిలిచారు.

కాగా తాజాగా అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అమల కలిసి తమ వంతుగా 28 లక్షల రూపాయలను వరద భాదితులకు విరాళం ప్రకటించి తమ సేవా దృక్పధాన్ని చాటుకున్నారు. అదే విధంగా అందరూ తమ వంతుగా వరద బాధితులను సాయం చేసి అండగా నిలబడాలని పేర్కొన్నారు.