నాగ్ నటించిన “బ్రహ్మాస్త్ర” విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చేసినట్టేనా?

Published on Nov 27, 2021 3:00 am IST


అక్కినేని నాగార్జున బాలీవుడ్‌లో “బ్రహ్మాస్త్ర” అనే సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రెండేళ్ల కాలంగా వాయిదాలు పడుతూనే వస్తుంది. ఈ సినిమా షూటింగ్‌కి ఏదో ఒక అంతరాయాలు ఎదురవుతూనే ఉన్నాయి.

అయితే ఆరు నెలల తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ని మొదలుపెట్టబోతున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ని పూర్తి చేయనున్నారట. అన్నీ అనుకుంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ 9వ తేదిన ఈ సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్‌లో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.

సంబంధిత సమాచారం :