టికెట్ రేట్లు తగ్గినా “బంగార్రాజు”కు ఏ ఇబ్బంది లేదు – నాగార్జున

Published on Jan 5, 2022 9:44 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు నేడు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన నాగార్జున ఏపీలో టికెట్ రేట్ల తగ్గుదల గురుంచి కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే సినిమా వేడుకకు సంబంధించిన వేదికపై రాజకీయాల గురుంచి నేను మాట్లాడనని అన్నారు. అయినా టికెట్ల రేట్లతో మా సినిమాకి ఎలాంటి సమస్య లేదని, మిగిలిన వారి సంగతి నాకు తెలియదని అన్నారు. ప్రస్తుత టికెట్‌ ధరలతో ఇబ్బందేమీ లేదని, టిక్కెట్ రేట్లు తక్కువైతే డబ్బులు తక్కువ వస్తాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తాయని, తమ సినిమా వసూళ్లు కొద్దిగా తగ్గినా పర్వాలేదని నాగ్ అన్నాడు. ప్రస్తుతం నాగ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :