బిగ్ బాస్ లో సిసలైన సందడి…కాజల్ ను ఇమిటేట్ చేసిన నాగ్!

Published on Dec 5, 2021 4:25 pm IST

స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో రోజురోజుకీ మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. ఫైనల్ దగ్గర పడుతున్న కొద్ది హౌజ్ లో ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షో కి సంబంధించిన ఒక ప్రోమో ను విడుదల చేయడం జరిగింది.

హౌజ్ లోని సభ్యులు ఇచ్చిన టాస్క్ ప్రకారం తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే మానస్ ను అక్కినేని నాగార్జున ఒక ప్రశ్న వేశారు. ఈ హౌజ్ లో సింపతీ సీకర్ ఎవరు అంటూ అడిగారు. అందుకు సమాధానం గా కాజల్ అని వ్యాఖ్యానించారు. ఈ సమాధానం కి అక్కినేని నాగార్జున కాజల్ ని ఇమిటేట్ చేయడం జరిగింది. నా వాళ్ళే నన్ను ఇలా అంటే ఎలా రా అంటూ ఇమిటేట్ చేశారు నాగ్. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నేడు స్టార్ మా లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :