ఆ వెబ్ సిరీస్ పై అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు!

Published on Sep 16, 2021 4:12 pm IST


ఆహా వీడియో సరికొత్త సినిమాలతో, వెబ్ సిరీస్ లతో, కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా వస్తున్న వెబ్ సిరీస్ లు మరియు సరికొత్త చిత్రాలు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల విడుదల అయిన ది బేకర్ అండ్ ది బ్యూటీ వెబ్ సిరీస్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మేరకు ఈ వెబ్ సిరీస్ పై ప్రముఖ టాలివుడ్ నటుడు అక్కినేని నాగార్జున స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ది బేకర్ అండ్ ది బ్యూటీ గురించి మంచిగా వుంటున్నాను అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన మొత్తం టీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు అని చెప్పారు. ఇంతటి విజయం సాధించిన వెబ్ సిరీస్ పై సంతోషం వ్యక్తం చేశారు. సంతోష్ శోభన్, టిన శిల్ప రాజ్ మరియు విష్ణు ప్రియ లు ఈ సీరిస్ లో కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరిస్ నిర్మాణం లో అన్నపూర్ణ స్టూడియోస్ సైతం భాగం కావడం విశేషం.

సంబంధిత సమాచారం :