“ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ” ట్రైలర్ ను రిలీజ్ చేసిన నాగార్జున అక్కినేని!

Published on Nov 8, 2021 6:56 pm IST

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ. జీ 5 నుండి సరికొత్త వెబ్ సిరీస్ గా ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ రానుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నేడు విడుదల చేయడం జరిగింది.

కామెడీ డ్రామా గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై కొణిదెల నీహారిక నిర్మిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19 వ తేదీ నుండి జీ 5 ఓటిటి లో ప్రసారం కానుంది. ఈ సీరీస్ లో తులసి మరియు నరేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More