బిగ్ బాస్ 5 కోసం ఎగ్జైంటింగ్ గా ఎదురు చూస్తున్న నాగార్జున!

Published on Sep 5, 2021 2:44 pm IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. నేటి నుండి ఐదవ సీజన్ మొదలు అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ మా లో ప్రసారం కానున్న ఈ షో కోసం సర్వత్రా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షో నేడు ప్రారంభం అవుతున్న విషయాన్ని స్టార్ మా సోషల్ మీడియా లో వెల్లడించడం జరిగింది. నేటినుంచి మొదలు కానున్న ఈ కార్యక్రమం కి సంబంధించిన ప్రోమో ను యాజమాన్యం విడుదల చేయడం జరిగింది.

ఎంతో గ్రాండ్ గా మొదలు కానున్న ఈ కార్యక్రమం లోకి అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మేరకు స్టార్ మా చేసిన పోస్ట్ పట్ల అక్కినేని నాగార్జున రెస్పాండ్ అయ్యారు. మరొక ఫెంటాస్టిక్ జర్నీ ఇచ్చినందుకు స్టార్ మా కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక షో కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు ప్రసారం కానుంది. శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :