“లవ్ స్టోరీ” ను ఆ ఎవర్ గ్రీన్ చిత్రంతో పోల్చుతూ చై కి ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగ్!

Published on Sep 14, 2021 12:11 am IST


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ విడుదల తో సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుంది అనేది అర్దం అవుతుంది. విడుదల అయిన కొద్ది సేపటికే లక్షల్లో లైక్స్ మరియు మిలియన్స్ లో వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో 3.2 మిలియన్ ప్లస్ వ్యూస్ పైగా సాధించి టాప్ లో ట్రెండ్ అవుతోంది. అదే విధంగా 272కే లైక్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్ సినీ పరిశ్రమ లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రైలర్ విడుదల తో అక్కినేని నాగార్జున స్పందించారు. అలనాటి ఎవర్ గ్రీన్ చిత్రం అయిన ప్రేమ్ నగర్ చిత్రం పోస్టర్ ను లవ్ స్టోరీ పోస్టర్ తో జత చేసి, లుకింగ్ గుడ్ రా చై, ఆల్ ది బెస్ట్ అంటూ నాగార్జున విషెస్ తెలిపారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :