భారీ వసూళ్లను రాబట్టిన “బంగార్రాజు”

Published on Jan 16, 2022 3:30 pm IST

అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగ చైతన్య నటించిన బంగార్రాజు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 2 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 36.5 కోట్లు రాబట్టింది. దీంతో అక్కినేని హీరోలకు అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది బంగార్రాజు చిత్రం.

సంక్రాంతి రోజు భారీ అంచనాల నడుమ విడుదల అయిన బంగార్రాజు, రెండో రోజు పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సినిమా తొలిరోజే రూ.17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 1వ రోజు కంటే 2వ రోజు వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అంతేకాకుండా, భారీ డిమాండ్ కారణంగా, రెండవ రోజు నుండి మరిన్ని థియేటర్లు జోడించబడ్డాయి. ఇప్పటికీ, ఈ చిత్రం అన్ని సెంటర్లలో హౌజ్ ఫుల్ గా రన్ అవుతుంది. రెండో వారంలో ఈ సినిమా మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ను జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :