ఇది చాలా బావుంది మామ – అక్కినేని సమంత

Published on Sep 20, 2021 10:36 pm IST


నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా హీరో నాగార్జున తన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఒక వీడియో ను రూపొందించారు. ANR lives on అంటూ ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా హీరో, నా ఇన్స్పిరేషన్ అంటూ నాగార్జున తెలిపారు. పంచకట్టు ఇష్టమని, పొందూరు కద్దర్ అంటూ పంచకట్టు కొని చేసిన విడియో ప్రేక్షకులను , అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే నాగార్జున ఎంతో భావోద్వేగం తో చేసిన ఈ అందమైన విడియో పై నటి, నాగార్జున కోడలు సమంత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది చాలా బావుంది నాగార్జున మామ అంటూ చెప్పుకొచ్చారు. ANR lives on అంటూ హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. అక్కినేని సమంత చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత ట్వీట్ ను లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :