అమెజాన్‌లోకి రాబోతున్న అక్షయ్ కుమార్ ‘బెల్‌బాటమ్‌’..!

Published on Sep 14, 2021 1:10 am IST


బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో, రంజిత్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై డ్రామా చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమయ్యింది.

ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 16 నుంచి ‘బెల్‌బాటమ్‌’ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు ఉంచుతున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ ప్రకటించింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌గా కనిపించగా, లారా దత్తా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో, వాణీకపూర్‌ అక్షయ్‌కుమార్ భార్యగా నటించారు.

సంబంధిత సమాచారం :