అక్షయ్ సినిమాతో మిగతా భారీ సినిమాలకు కాన్ఫిడెన్స్.!

Published on Nov 6, 2021 10:07 am IST

ఇపుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా బారి నుంచి దాదాపు అంతా కోలుకున్నట్టు అయ్యింది. పూర్తి స్థాయిలో కరోనా నివారణ కాలేదు కానీ దాని వల్ల జరగాల్సిన నష్టాలు ఇప్పటికే చాలా జరిగాయి. మరి ఇదే క్రమంలో సినీ పరిశ్రమ కూడా చాలా నష్టాన్ని చూసింది. ముఖ్యంగా థియేటర్స్ సంస్థ భారీ నష్టాలను చవి చూసింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు మొత్తం ఇండియా వైడ్ ఆశలు చిగురిస్తున్నాయి.

మొట్ట మొదటగా టాలీవుడ్ సినిమాలు దుమ్ము లేపగా ఇప్పుడు హిందీ మార్కెట్ లో కూడా సినిమాలు బాగా రాణిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూర్య వంశీ సినిమా ఊహించిన దానికంటే రెస్పాన్స్ ను అందుకుంది. దీనికి ఎలాంటి వసూళ్లు వస్తాయి అనే దానిపైనే చాలా డౌట్స్ ఉన్నాయి.

ఎందుకంటే ఇక మున్ముందు పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉంది. వాటికి దీని రిజల్ట్ నే కీలకం. కానీ ఫైనల్ గా ఆడియెన్స్ మాత్రం వారిని గెలిపించి రాబోయే సినిమాలకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇక ముందు రాబోయే అన్ని భాషల భారీ సినిమాలకు ఒక సుమార్గం దొరికేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :