సూర్య సర్ప్రైజ్ తో ప్రామిసింగ్ గా అక్షయ్ “సఫారియా” ట్రైలర్

సూర్య సర్ప్రైజ్ తో ప్రామిసింగ్ గా అక్షయ్ “సఫారియా” ట్రైలర్

Published on Jun 18, 2024 1:08 PM IST

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ చిత్రం “బడే మియా చోటే మియా” తో పాన్ ఇండియా ఆడియెన్స్ ని పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత అక్షయ్ హీరోగా నటించిన మరో అవైటెడ్ సినిమానే “సఫారియా”. దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్ లో చేసిన ఈ చిత్రం తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన “సూరారై పోట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” కి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు.

మరి ఈ సినిమా నుంచి ఇప్పుడు అవైటెడ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. ఎలాగో ఈ సినిమా కోసం మన తెలుగు ఆడియెన్స్ కి చాలా మందికి తెలుసు. అప్పుడు కోవిడ్ సమయంలో వచ్చిన ట్రైలర్ కట్ లానే దాదాపు మేకర్స్ దీనిని కూడా ప్రామిసింగ్ గా కట్ చేశారు. అక్షయ్ లోని రెండు మూడు షేడ్స్ లో బాగున్నాడు. కానీ యంగ్ వెర్షన్ లో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.

కానీ నెక్స్ట్ వెర్షన్స్ బాగున్నాయి. ఇంకా నటుడు పరేష్ రావల్ సహా కొందరు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ సరసన రాధికా మదన్ నటిస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో మరో సర్ప్రైజింగ్ అంశం హీరో సూర్య కామియో అని చెప్పాలి. ఎయిర్ పోర్ట్ లో అక్షయ్, సూర్య లు ఎదురయ్యే సీన్ ట్రైలర్ లో చూపించారు. ఇది ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి హిందీలో కూడా జీవి ప్రకాష్ కుమార్ నే సంగీతం అందించగా ఈ జూలై 12 న గ్రాండ్ గా హిందీలో రిలీజ్ కాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు