అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jun 27, 2022 11:00 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ చారిత్రాత్మక సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్. ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత స్థాయిలో నిర్మితం అయిన ఈ సినిమాలో సామ్రాట్ ప్రిథ్వీరాజ్ చౌహన్ పాత్రలో కనిపించగా ఆయనకి జోడీగా సంయోజితా పాత్రలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ నటించారు. ఇది ఆమెకు హీరోయిన్ గా డెబ్యూ మూవీ. చంద్రప్రకాష్ కథ అందించడంతో పాటు దర్శకత్వంలో వహించిన ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం ఈ మూవీ అందుకోలేకపోయింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ మూవీలో ఇతర పాత్రల్లో సోను సూద్, సంజయ్ దత్, అశుతోష్ రానా, సాక్షి తన్వార్ తదితరులు నటించారు అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా జులై 1 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఒటిటి విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఇది గుడ్ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు