అక్షయ్ కుమార్ “రామ్ సేతు” ట్రైలర్ రిలీజ్ కి రెడీ!

Published on Oct 7, 2022 10:55 pm IST


బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తదుపరి విడుదల రామ్ సేతు మంచి బజ్ ను సొంతం చేసుకుంది. భారతదేశం లోని పురాతన రామసేతు వంతెనను పరిశోధించే పురావస్తు శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ ఈ సినిమా లో నటించాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 11న విడుదల కానుంది.

ఈ బిగ్గీ కూడా దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 25 న హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు మరియు తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుంది. అభిషేక్ శర్మ ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా కి దర్శకత్వం వహించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భరుచా మరియు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా, భౌమిక్ గొండాలియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :