అక్షయ్ “సూర్య వంశీ” నైజాంలో డీసెంట్ వసూళ్లు.!

Published on Nov 7, 2021 3:00 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే మరో స్టార్ హీరోలు అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్ ఇంకా కత్రినా కైఫ్ లాంటి స్టార్ నటులు నటించిన బిగ్ మల్టీ స్టారర్ చిత్రం “సూర్య వంశీ”. పలు అనుమానాలతోనే థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయ్యి వచ్చిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ఓవరాల్ రాబట్టింది. అయితే హిందీ మార్కెట్ లోనే అనుకుంటే మన దగ్గర నైజాం లో డీసెంట్ వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం గమనార్హం.

ఈ చిత్రం రెండో రోజు నైజాం లో 72.60 లక్షలు గ్రాస్ వసూలు చెయ్యగా 62 లక్షలు నెట్ అందుకుంది. దీనితో మొత్తం ఈ సినిమాకి 1.58 కోట్లు గ్రాస్ వసూలు చెయ్యగా నెట్ 1.35 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మాత్రం మిగతా భారీ సినిమాలకు వచ్చినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :

More