నెట్‌ఫ్లిక్స్ నుంచి అల్లు అర్జున్ సినిమా ఔట్.. కారణం ఇదే!

నెట్‌ఫ్లిక్స్ నుంచి అల్లు అర్జున్ సినిమా ఔట్.. కారణం ఇదే!

Published on Feb 8, 2025 8:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరం చూశాం. పుష్పరాజ్ పాత్రలో ఆయన చేసిన విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘పుష్ప 2’ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా.. దీనికి గ్లోబల్ స్థాయిలో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.

అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఓ అల్లు అర్జున్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ నుంచి త్వరలోనే తొలగించనుంది. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే, వారు అనుకుంటున్నట్లు ఇది ‘పుష్ప 2’ మూవీకి సంబంధించింది కాదులెండి. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ రైట్స్ సన్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ‘అల వైకుంఠపురములో’ చిత్ర నాన్-ఎక్స్‌క్లూజివ్ రైట్స్ రూపంలో అగ్రీమెంట్ ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఇంతకాలం ఓటీటీ స్ట్రీమింగ్ చేసింది.

ఇప్పుడు ఈ రైట్స్‌కి సంబంధించిన అగ్రీమెంట్ డేట్ ముగియనుంది. దీంతో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చివరగా ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్ చేయనుంది. ఆ తర్వాత రోజు నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించదు. దీంతో అభిమానులు ఈ సినిమాను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లా్ట్‌ఫామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు