“అల వైకుంఠపురములో” హిందీ రిలీజ్ కి రికార్డ్ నెంబర్ స్క్రీన్స్.?

Published on Jan 19, 2022 9:01 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా నటించిన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తన లేటెస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ “పుష్ప” రిలీజ్ తో మేకర్స్ అల వైకుంఠపురములో హిందీ రిలీజ్ ని కూడా రంగంలోకి దింపారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకి కూడా ఇప్పుడు హిందీ ఆడియెన్స్ లో మంచి బజ్ అయితే నడుస్తుంది.

దీనితో ఈ సినిమా థియేటర్స్ లో ఎలా పెర్ఫామ్ చేస్తుందా అనే ఆసక్తి ఓ పక్క నెలకొనగా ఇంకోపక్క క్రేజీ బజ్ ఒకటి బాలీవుడ్ వర్గాల లో వైరల్ అవుతుంది. దీని ప్రకారం. ఈ సినిమాని ఏకంగా 2000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది.

తన లాస్ట్ సినిమా పుష్ప నే హిట్ టాక్ తెచ్చుకొని 1600 స్క్రీన్స్ వరకు హిందీలో వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు సినిమాకి 2000 అంటే రికార్డే అని చెప్పాలి. ఇదే గాని నిజం అయితే మళ్ళీ బన్నీ కి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. అలాగే హిందీలో గోల్డ్ మెన్స్ టెలి ఫిల్మ్స్ వారు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం :