“అల వైకుంఠపురములో” హిందీ రీమేక్ వాయిదా.!

Published on Jan 31, 2023 8:05 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “అల వైకుంఠపురములో” కోసం తెలిసిందే. మరి ఈ సినిమాని హిందీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించగా రోహిత్ ధావన్ దర్శకత్వం “షెహ్ జాదా” గా తెరకెక్కించారు. అయితే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ చిత్రం మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం సిద్ధం చేసుకొని ఈ ఫిబ్రవరి 10న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చిత్రం రీమేక్ ని మరో వారానికి వాయిదా వేసి ఫిబ్రవరి 12న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ ఈ సినిమా వాయిదా కన్ఫర్మ్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ మరియు టి సిరీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :