హిందీ “అల వైకుంఠపురములో” టైటిల్, రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.!

Published on Oct 13, 2021 2:00 pm IST

గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం “అల వైకుంఠపురములో” కూడా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ కెరీర్ లో హ్యాట్రిక్ సినిమాగా భారీ లెవెల్ హిట్ ని ఇవ్వడంతో మరోసారి బన్నీ విజయం పాన్ ఇండియన్ లెవెల్లో మారుమోగింది. ఇక ఈ సినిమా అందుకున్న విజయం చూసి హిందీలో అప్పుడే రీమేక్ కి ఆఫర్స్ వచ్చేసాయి.

ఆర్యన్ కార్తీక్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అలాగే మరింత ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు టైటిల్ ని అలాగే రిలీజ్ డేట్ ని ఇపుడు ఫిక్స్ చేసుకుంది. హిందీలో ఈ సినిమాకి “షెహ్ జాదా” అనే టైటిల్ ని పెట్టి ‘హీ రిటర్న్స్ హోమ్’ అనే ట్యాగ్ పెట్టారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించారు. మరి హిందీలో ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :