పవన్ మిస్సవ్వడంపై అందరికీ ఆలీ లేటెస్ట్ క్లారిఫికేషన్.!

పవన్ మిస్సవ్వడంపై అందరికీ ఆలీ లేటెస్ట్ క్లారిఫికేషన్.!

Published on Dec 2, 2022 7:00 PM IST


గత కొన్ని రోజులు కితమే మన టాలీవుడ్ సీనియర్ కమెడియన్ మరియు నటుడు ఆలీ తన కూతురు వివాహాన్ని ఎంతో అట్టహాసంగా జరిపించిన సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ పెళ్ళిలో అయితే మెగాస్టార్ చిరంజీవి, వెంకీ మామ అలాగే ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరు కాగా నెక్స్ట్ ఏపీ సీఎం వై ఎస్ జగన్ కూడా హాజరు కావడం వార్తల్లో నిలిచాయి.

అయితే అందరూ వచ్చినా ఆలీకి అత్యంత ఆప్తుడు టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో మిస్వడం అనేక చర్చలకు దారి తీసింది. కానీ లేటెస్ట్ గా అయితే ఆలీ ఈ చర్చలకు ఎండ్ కార్డు వేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ ని తాను ఆహ్వానించడం జరిగింది అని కాకపోతే పవన్ ఫ్లైట్ మిస్ కావడం మూలాన రావడం కుదరలేదు అని అయితే తాను తర్వాత కలుస్తానని కూడా చెప్పారని ఆలీ అయితే లేటెస్ట్ గా తెలిపారు. దీనితో అయితే చాలా మందికి ఆలీ క్లారిఫికేషన్ తో సమాధానం దొరికినట్టే అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు