వైరల్ పిక్ : వండర్ ఉమన్ తో అలియా భట్ …. !!

Published on Jul 9, 2022 12:00 am IST

బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితం. ఇటీవల దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో సీత పాత్ర చేసిన అలియా, ఆ పాత్రలో తన అందం అభినయంతో ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల రణబీర్ కపూర్ ని వివాహమాడిన అలియా ప్రస్తుతం ఆయనతో కలిసి ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలో భర్త రణబీర్ తో కలిసి ఆమె నటిస్తున్న భారీ మూవీ భ్రహ్మస్త్ర విడుదలకు రెడీ అవుతోంది. ఇక తొలిసారిగా ఆమె నటిస్తున్న హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్. స్పై థ్రిల్లర్ గా భారీ యాక్షన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి టామ్ హార్పర్ దర్శకుడు.

ఈ మూవీలో వండర్ వుమన్ ఫేమ్ గాల్ గడాట్ మెయిన్ రోల్ చేస్తుండగా పైలట్ వేవ్, మాకింగ్ బర్డ్ పిక్చర్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విదేశాల్లో జరుగుతుండగా షూటింగ్ లొకేషన్లో టీమ్ తో దిగిన ఫోటోలని, ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన గాల్ గడాట్ తో కలిసి దిగిన ఫోటోని కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు అలియా భట్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మెడిలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :