రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్‌కు అలియా భట్ మద్దతు!

Published on Jul 25, 2022 4:48 pm IST

సూపర్ స్టార్ రణవీర్ సింగ్ ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం చేసిన తన న్యూడ్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ షూట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో, రణవీర్ తన బిహేవియర్ కోసం మరియు భారతదేశంలోని యువతకు తప్పుడు సందేశాన్ని పంపినందుకు చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది.

ఇప్పుడు అతడికి మద్దతు గా అలియా భట్ వచ్చింది. తన కొత్త చిత్రం డార్లింగ్స్ ట్రైలర్ లాంచ్‌లో మాట్లాడుతూ, “నాకు ఇష్టమైన రణవీర్ సింగ్ గురించి ఏదైనా ప్రతికూలంగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అతనిని టార్గెట్ చేసే ఈ ప్రశ్నని నేను సహించలేను. నేను అతనిని ప్రేమిస్తున్నాను మరియు అతను మనలో ప్రతి ఒక్కరికీ శాశ్వతంగా ఇష్టమైనవాడు. అతను తన సినిమాలతో మనకు చాలా ఇచ్చాడు కాబట్టి మనం అతనికి ప్రేమను మాత్రమే అందించాలి” అంటూ చెప్పుకొచ్చారు. అలియా భట్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం :