మూడు ముళ్ళతో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట.. పిక్స్ వైరల్..!

Published on Apr 14, 2022 10:14 pm IST


బాలీవుడ్‌ ప్రేమ జంట ఆలియాభట్‌-రణ్‌బీర్‌కపూర్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రణ్‌బీర్ కపూర్ నివాసమైన బాంద్రా ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కార్యక్రమాల నుంచి పెళ్లి వరకు ఒక్క ఫోటోని కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడింది ఈ జంట. అయితే తాజాగా తమ పెళ్లి ఫోటోలను ఆలియా భట్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాం. ఈరోజు మాకెంతో ప్రత్యేకం” అంటూ ఆలియా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :