పెళ్లికి రెడీ అవుతున్న క్రేజీ జంట ?

Published on Mar 28, 2022 8:24 pm IST

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చేసుకున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించాలని ప్లాన్ చేస్తోంది. నిజానికి గత మూడేళ్ల నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓ దశలో పెళ్లి చేసుకోవాలని వీళ్ళు ఆలోచించారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళ పెళ్లి పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది.

కాగా ఈ జంట 2022లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రాను రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కలిసింది. అయితే, మనీశ్‌ను పెళ్లి దుస్తుల డిజైన్ కోసమే నీతూ కలసిందని అంటున్నారు. మరోపక్క అలియా – రణబీర్ కపూర్ కూడా తమ పెళ్లి గురించి సీరియస్ గా ఆలోచిస్తుంది. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర విడుదల రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :