ఇంట్రెస్టింగ్..హాలీవుడ్ లోకి స్టార్ హీరోయిన్ ఆలియా భట్.!

Published on Mar 8, 2022 2:00 pm IST

మన ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ కూడా ఒకరు. తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకునే ఆలియా రీసెంట్ గా అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రం “గంగూబాయి కతియావాది” తో వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మరి ఇదిలా ఉండగా ఇంకో పక్క భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” తో ఈ మార్చ్ లో పాన్ ఇండియా సినిమా దగ్గరకి రానుండగా తాజాగా తాను ఓ భారీ అనౌన్సమెంట్ ని చేసింది. తాను హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసింది.

మరి దీని వివరాల్లోకి వెళితే ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ చిత్రం “హార్ట్ ఆఫ్ స్టోన్” అనే సినిమాలో కీలక పాత్ర చేసేందుకు తాను రెడీ అయ్యినట్టు తెలిపింది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి “వండర్ విమెన్” ఫేమ్ గల్ గడోత్ కూడా నటిస్తుండడం విశేషం. దీనితో ఈ భారీ అనౌన్సమెంట్ ఇండియన్ సినిమా దగ్గర ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :