Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా నుంచి విడుదల అయ్యిన పలు బిగ్ బ్యానర్ సినిమాల్లో ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ్ రవైల్ తెరకెక్కించిన యాక్షన్ సినిమా “ఆల్ఫా” కూడా ఒకటి. బాలీవుడ్ ఫేమస్ యాక్షన్ స్పై యూనివర్స్ యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా దీన్ని విడుదలకి తీసుకొచ్చారు.

కానీ ఈ సినిమా ఈ స్పై యూనివర్స్ సినిమాలు అన్నింటిలో వీక్ సినిమాగా ముద్ర వేసుకుంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు ఇప్పుడు దీని డేట్ రివీల్ చేశారు. దీని ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ కామియోలో నటించగా బాబీ డియోల్ విలన్ గా నటించారు.

Exit mobile version