ఓటీటీలోకి “గంగూబాయి” రాక అప్పుడే !

Published on Mar 13, 2022 9:19 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘అలియా భట్’ మెయిన్ లీడ్ గా బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో “గంగూబాయి ఖతియావాది” సినిమా తెరకెక్కింది. కాగా ఈ బిగ్గెస్ట్ ఎమోషనల్ డ్రామాకి పాజిటివ్ టాకే వచ్చింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కానుంది. మార్చి 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్ వన్ విమెన్ షోగా సినిమాని నడిపించింది. గంగూబాయి పాత్ర పరిస్థితులకు తగ్గట్టు పాత్రలోని ఎమోషన్స్ కు తగ్గట్టు చక్కగా నటించి అలియా మెప్పించింది. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన శైలి నటనతో అలియా చాలా బాగా నటించింది.

సంబంధిత సమాచారం :