అలియా భట్ చిత్రం కి విడుదల తేదీ ఫిక్స్!

Published on Sep 30, 2021 5:22 pm IST

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు అలియా భట్. ప్రస్తుతం ఇండియా లోనే టాప్ హీరోయిన్ లలో అలియా భట్ ఒకరని చెప్పాలి. అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గంగుభాయ్ కథివాది చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల కి సంబందించిన అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 6 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే థియేటర్లు మెల్లగా తెరుచుకుంటున్నాయి.

అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగుభాయ్ కథివాది చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై లో ప్రముఖ సెక్స్ వర్కర్ అయిన గంగుభాయ్ అనే మహిళ యొక్క నిజ జీవిత ఆధారం గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్ ఇటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు పాత్రలో, కొమురం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీ గా మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :