స్టార్ హీరోయిన్ కి సాలిడ్ కంబ్యాక్ ఖాయం..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవాను మరింత పెంచేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో భాగమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో దీపికా పదుకొనే స్థానంలో ఆలియా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొద్దిగా ఆలస్యమైంది, త్వరలోనే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనుంది.

​ఇది మాత్రమే కాకుండా, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’లోనూ ఆలియా భట్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు చివరి దశకు చేరాయని, త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు కనుక ఖరారైతే, ఆలియా టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటారు.

Exit mobile version