లేటెస్ట్ : తమ కూతురి పేరు అనౌన్స్ చేసిన అలియా భట్, రణబీర్ కపూర్

లేటెస్ట్ : తమ కూతురి పేరు అనౌన్స్ చేసిన అలియా భట్, రణబీర్ కపూర్

Published on Nov 25, 2022 1:56 AM IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ గా ప్రస్తుతం అక్కడ మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న వారిలో రణబీర్ కపూర్, అలియా భట్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఇటీవల ఈ ఇద్దరూ వివాహం చేసుకుని గత కొన్నాళ్లుగా హ్యాపీ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వీరికి ఒక ముద్దుల పాప పుట్టడంతో వారి ఇంట అమితానందం వెల్లివిరిసింది.

బిడ్డ పుట్టడంతో అనేకమంది సినిమా ప్రముఖులు అలానే ఎందరో ప్రేక్షకాభిమానులు వారిద్దరికీ విశేషంగా శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా నేడు ఆ బిడ్డకు రహా అనే పేరు నిర్ణయించినట్లు కొద్దిసేపటి క్రితం అలియా భట్ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులకు ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. అంతే కాదు రహా అనే పేరుకి గల అర్ధాన్ని కూడా ఆమె తెల్పడం జరిగింది. రహా అంటే అద్భుతం, ఆనందం, ఆహ్లాదం అని, తను రాకతో మా ఇల్లు ఒక్కసారిగా మరింత గొప్పగా మారిపోయింది అంటూ అలియా భట్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు