అలియా-రణబీర్ పెళ్లికి కాంట్రాక్ట్ తీసుకోబోతున్నారా?

Published on Apr 7, 2022 2:02 am IST

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ పెళ్లి గురించే ప్రస్తుతం అంతా మాట్లాడుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, ఏప్రిల్ 16 న వీరి పెళ్లి జరగబోతుందని టాక్ నడుస్తుంది. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. రణబీర్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న చెంబూర్ లోని ఆర్కే హౌస్ లో వీరిద్దరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుందని తెలుస్తుంది.

అయితే ఈ జంట వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలియా-రణబీర్ తమ పెళ్లిని చాలా గోప్యంగా ఉంచాలని చూస్తున్నారట. అందుకోసం వీరు ప్రత్యేకంగా వారి వెడ్డింగ్ టీమ్ ని కాంట్రాక్టు అడుగుతున్నారట. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, పెళ్లి పనులు చేసేవారు, డెకరేషన్ టీమ్, డీజే టీమ్, డిజైనర్ టీమ్ ఇలా పెళ్లి కోసం పనిచేసే ప్రతి ఒక్కరి వద్ద కాంట్రాక్ట్ రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారని, పెళ్లి అయ్యే వరకు ఎటువంటి ఫొటోస్, వీడియోస్ లీక్ కాకుండా చూడాలని.. ఒకవేళ పొరపాటున లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆ కాంట్రాక్ట్ లో రాసి ఉందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :