“సర్కారు వారి పాట” ఆ బిగ్ గెస్ట్ పై ఆసక్తి.!

Published on May 7, 2022 3:10 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొనగా ఈరోజు ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది.

అయితే ఈ ఈవెంట్ కి గాను మొదట స్పెషల్ గెస్ట్ ఎవరు లేరనే టాక్ వినిపించింది కానీ ఇప్పుడు అయితే ఓ బిగ్ గెస్ట్ వచ్చే అవకాశం ఉందని శ్రేయాస్ వారు టీజ్ చేస్తున్నారు. ఇంకా గెస్ట్ పేరు ఏంటి అనేది రివీల్ కాలేదు కానీ ఓ గెస్ట్ అయితే వస్తారు అని అంటున్నారు.

మరి దీనితో ఆ గెస్ట్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :