“సర్కారు వారి పాట” డే 1 కలెక్షన్ కోసం ఆసక్తి.!

Published on May 12, 2022 12:10 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు దాదాపు రెండేళ్ల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో సిల్వర్ స్క్రీన్ పై పడనుండగా ఈ సినిమా ఓపెనింగ్స్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మాములుగా మహేష్ బాబు సినిమాలు అంటేనే బిగ్ డే 1 తో స్టార్ట్ అవుతాయి. అలాంటిది ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే మరో నూతన అధ్యాయం టైప్ లో చాలా సరికొత్త ప్రెజెంటేషన్ తో రావడానికి సిద్ధం అయ్యింది. దీనితో మరింత ఆసక్తి ఈ సినిమా పట్ల నెలకొంది.

ఇప్పటికే అన్ని చోట్లా సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. మరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ సర్కారు వారి పాట ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :