ఎన్టీఆర్ కూడా ఉండి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేదా.!

Published on Feb 27, 2023 4:25 pm IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా మన టాలీవుడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” RRR పేరే నలు మూలలా వినిపిస్తూ వస్తుంది. ఈ సినిమాతో గ్లోబల్ దర్శకునిగా మారిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో సెన్సేషన్ ని అందుకుంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ కి ఈ సినిమా ఎంపిక కావడం మరింత గర్వకారణంగా అయితే నిలిచింది.

అయితే రీసెంట్ గానే యూఎస్ కి చిత్ర యూనిట్ అంతా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో సోషల్ మీడియా అంతా చిత్ర దర్శకుడు రాజమౌళి నటుడు రామ్ చరణ్ సహా కీరవాణి పేర్లతో దద్దరిల్లుతుంది. మరి వీరిలో ఎన్టీఆర్ పేరు మిస్ అయ్యిన లోటు బాగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఒకవేళ తాను కూడా ఉండి ఉంటే ఈ సంబరాలు అన్నీ ఇంకో లెవెల్లో ఉండేవని చెప్పడంలో సందేహమే లేదు.

అలాగే ఈ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్ ని మిస్ అవుతున్న వారు కూడా గ్లోబల్ గా అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ తారక్ పరిస్థితి వేరే విధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ తనకి ఆహ్వానం ఉన్నా లేకపోయినప్పటికీ కుటుంబంలో జరిగిన విషాదంతో తనకి వెళ్లే పరిస్థితి లేదు. దీనితో ప్రస్తుతానికి మిగతా యూనిట్ అక్కడ ఉన్నప్పటికీ తర్వాత తారక్ అకాడమీ ఈవెంట్ నాటికి యూనిట్ తో కలిసే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అయితే స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :