‘ఏజెంట్’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కి అంతా సిద్ధం…!!

Published on Jul 12, 2022 9:00 pm IST

అఖిల్ తో సురేందర్ రెడ్డి ఫస్ట్ టైం తీస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ పై బిగినింగ్ నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు కెరీర్ పరంగా చేసిన మూవీస్ తో క్లాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అఖిల్, ఇందులోని రా ఏజెంట్ పాత్రతో తప్పకుండా మాస్ ఆడియన్స్ లో కూడా మరింత క్రేజ్ దక్కించుకుంటారని అంటోంది యూనిట్.

సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారట. ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని జులై 15న అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. విజువల్ గా అదిరిపోయిన ఏజెంట్ టీజర్ రిలీజ్ తరువాత అందరిలో మూవీ పై మరింత హైప్ ఏర్పరుస్తుందట. మరొక మూడు రోజుల్లో ఏజెంట్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానుండడంతో అక్కినేని ఫ్యాన్స్ అయితే టీజర్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా నాగ్ తనయుడు అఖిల్ ఈ మూవీతో కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకోవడం ఖాయం అని వారు అంటున్నారు. భారీ హంగులతో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఏజెంట్ మూవీని ఆగష్టు 12న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :