నెవర్ బిఫోర్ ట్రిబ్యూట్ – మెగాకార్నివాల్ కి సర్వం సిద్ధం

Published on Aug 19, 2022 9:00 pm IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలు చేస్తున్న మెగాస్టార్ ఈనెల 22న తన 67వ బర్త్ డే జరుపుకోనున్నారు. ఇక మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగా మెగాస్టార్ బర్త్ డే వేడుకల్ని ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ కోసం ఒక పెద్ద కార్నివాల్ ఏర్పాటు చేసారు. అన్ని ప్రాంతాల నుండి భారీగా ఫ్యాన్స్ తరలిరానున్న ఈ మెగా ఈవెంట్ కి మెగాఫ్యమిలీ హీరోస్ తో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటల నుండి హైదరాబాద్ లోని హైటెక్స్ హాల్ 2 లో ఇది జరగనుండగా దీనిని నెవర్ బిఫోర్ ట్రిబ్యూట్ గా తమ అభిమాన హీరో మెగాస్టార్ లైఫ్ లో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తొలిసారిగా సినిమా రంగ చరిత్రలోనే ఒక హీరో యొక్క ఫ్యాన్స్ కోసం ఈ విధంగా నిర్వహిస్తున్న ఈ కార్నివాల్, తన సోదరుడు మెగాస్టార్ కెరీర్ లో మెమొరబుల్ గా నిలిచిపోతుందని మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ చెప్పారు.

సంబంధిత సమాచారం :