‘ఆదిపురుష్’ టీజర్ గ్రాండ్ లాంచ్ కి సర్వం సిద్ధం

‘ఆదిపురుష్’ టీజర్ గ్రాండ్ లాంచ్ కి సర్వం సిద్ధం

Published on Oct 1, 2022 7:00 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ భారీ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావన్మంది ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ లంకేశ్ గా కనిపిస్తుండగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక నిన్న రిలీజ్ అయిన ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కి దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ రాగా రేపు ఉదయం ఈ మూవీ యొక్క అఫీషియల్ టీజర్ ని ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో గల సరయు బ్యాంకు ఆవరణలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు .అనేకమంది ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ఇప్పటికే ఆల్మోస్ట్ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. కాగా అక్కడి ఈ భారీ ఈవెంట్ స్టేజ్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు